Thursday, January 30, 2025

TG – విదేశాల నుంచి తాము డబ్బు తెస్తుంటే , బిఆర్ఎస్ ఇక్క‌డ డ‌బ్బు వాళ్ల‌కు దోచిపెట్టింది … రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80 వేల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయ‌ని, ఆయా కంపెనీలకు ధన్యవాదాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలలో.. ఇదే అతి పెద్ద విజయం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం ఆరోపించారు.

దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో నేడు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, ప్రపంచ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. 2004-2014 వరకు అప్పుడు తీసుకున్న నిర్ణయాల మేరకు పెట్టుబడులు వచ్చాయన్నారు. నాడు ప్రధాని పీవీ సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకు వచ్చారు.. ప్రపంచానికి ఒక బలమైన విశ్వాసాన్ని కాంగ్రెస్ నాయకత్వం చూపిందని తెలిపారు. రాజకీయ పరమైన విధానాలను విభేదించినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపేక్షించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టతతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి దారులకు వేగంగా భూములు అనుమతులు ఇస్తున్నాం.. ఉద్యోగావకాశాలు పెంచాలని తమ ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

తెలంగాణకు దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.. వారికి కావలసిన భూములు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ భవిష్యత్‌లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండాలన్నారు. వన్ ట్రిలియన్ ఏకానమీ కలిగి.. దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా1 నిలిచిందని సీఎం పేర్కొన్నారు.

సింగపూర్‌‌లో 10వ త‌ర‌గ‌తి చదివిన తర్వాత విద్యార్ధులను సాంకేతిక నైపుణ్యంలో నిష్ణాతులైన వారిగా రూపొందిస్తుంది.. ఆ సంస్థతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ-సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు.

తాము దావోస్ వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలు మన దగ్గర సొమ్ము పెడతా అని వచ్చారన్నారు. ఈ ఫార్ములాలో ఇక్కడ సొమ్ము విదేశాలకు పంపారు.. పెట్టుబడి పెట్టుకున్నారు.. ప్రజల సొమ్ము కొల్లగొట్టి విదేశాల్లో పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏ సంస్థలు పెట్టుబడి పెట్టాయో వివరాలు ఇస్తానని అన్నారు. తాము కంపెనీల కార్యాలయాలకు వెళ్లలేదు.. కంపెనీలు తమ ఆఫీస్‌కి వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారని సీఎం తెలిపారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల జాబితా ఇస్తామని పేర్కొన్నారు. కంపెనీలతో చెక్ చేసుకోండి.. పెట్టుబడులు స్వాగతించక పోయినా అక్కసు ఎందుకని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement