Sunday, October 6, 2024

TG ఆ ఆరు ప్రాజెక్టు లు త్వరగా పూర్తి చేయండి – అధికారులకు రేవంత్ ఆదేశం

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

.

గోదావరి బేసిన్‌లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.గోదావరి బేసిన్‌తో పాటు కృష్ణా బేసిన్‌లో అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలపై ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సీఎం ఆరా తీశారు. ఇప్పటికే చాలావరకు నిధులు ఖర్చుపెట్టి మధ్యలో వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

- Advertisement -

.ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వం పదేండ్లలో ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయన్నారు. మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే గత ప్రభుత్వం వదిలేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement