హైదరాబాద్ – ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా సత్య ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా వెళ్లారు.. హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న స్కిల్డ్ వర్శిటీపై ఆయనతో రేవంత్ చర్చలు జరిపారు.. ఈ వర్శిటీ ఏర్పాటు అవశ్యకతను సిఈవోకి వివరించారు.. అలాగే ఎఐ, క్లాడ్ కంప్యూటింగ్ విభాగాలను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద రెండో క్యాంపస్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటి అభివృద్ధికి తమ సర్కార్ గణనీయంగా ప్రొత్సాహలు ఇస్తున్నదని రేవంత్ చెప్పారు.. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు . దీనికి సత్య నాదేండ్ల సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ..
Advertisement
తాజా వార్తలు
Advertisement