Tuesday, December 3, 2024

TG ఝాన్సీ రెడ్డికి రేవంత్ పరామర్శ

తొర్రూరు,నవంబర్3(ఆంధ్రప్రభ):ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని గాయపడి హైదరాబాదులో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు..

ఆదివారం హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని నివాసంలో కోలుకుంటున్న ఝాన్సీ రెడ్డిని ఆదివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి లతో కలిసి సీఎం పరామర్శించి భరోసా కల్పించారు.

- Advertisement -

పరామర్శకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి,పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి ఝాన్సీ రెడ్డి రావాలని సీఎం ఆకాంక్షించారు. పార్టీని నియోజకవర్గంలో ప్రబల శక్తిగా మార్చాలని కోరారు. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరు, కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణ, పార్టీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై సీఎం ఝాన్సీ రెడ్డి,ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో చర్చించారు.

పథకాలను ప్రజల్లోకి విస్తృతస్థాయిలో తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పి కొట్టాలని సూచించారు. శ్రేణులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లి ప్రజలను కలుసుకుంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఝాన్సీ రెడ్డి సీఎంకు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement