Friday, September 20, 2024

TG – మాన‌వీయ కోణంలో వ‌ర‌ద సాయం చేయండి .. కేంద్ర బృందంతో రేవంత్

హైద‌రాబాద్ – మాన‌వ‌తా దృక్ప‌ధంతో వ‌ర‌ద సాయం చేయాల్సిందిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ‌ర‌ద ప‌రిశీల‌న బృందానికి విజ్ఞ‌ప్తి చేశారు.. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టం అంచనాకు జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ అడ్వయిజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి చేసుకుని నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో భేటి అయింది.. ఈ స‌మావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, పొంగులేటి వరద నష్టంపై కేంద్ర బృందంతో చర్చించారు. పంట నష్టం, ఆస్తుల విధ్వంసం వంటి వివరాలను కేంద్ర బృందానికి నివేదించారు ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని బృందానికి గ‌ణాంకాల‌తో సిఎం వివ‌రించారు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయని, . అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఇండ్లు , పంటలు నష్టపోయి ఆర్థికంగా నష్టపోయార‌న్నారు. అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని రేవంత్ కేంద్ర బృందాన్ని కోరారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement