Thursday, October 3, 2024

TG – ఫామ్ హౌస్ లు కాపాడుకోవ‌డానికే పేదలతో బి ఆర్ ఎన్ రాజ‌కీయాలు – రేవంత్

డిజిట‌ల్ కార్డు.. ఫ్యామిలీకి ర‌క్ష‌!
ఒకే కార్డులో అన్ని వివ‌రాలు
30 శాఖ‌ల‌తో క్రోడీక‌రించిన స‌మాచారం
ప‌థ‌కాలు పొందేందుకు ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు దోహ‌దం
సికింద్రాబాద్ సిఖ్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
స‌బిత‌మ్మ‌.. మీ ఫామ్ హౌస్ లెక్క కూడా ఉంది
ఈట‌ల రాజేంద‌ర్ రావాలి..
మోదీ ద‌గ్గ‌ర‌కే పోదాం.. ఏమి ఇప్పిస్తారో చూద్దాం
ఫామ్ హౌస్ కాపాడుకోవ‌డానికే ఈ రాజ‌కీయాలు
కేటీఆర్‌.. హ‌రీశ్‌పై మండిప‌డ్డ రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ :

పేదలను అడ్డం పెట్టుకొని ఫాం హౌస్ లు కాపాడాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ఆక్రమించిన వారికి ఎలా సాయం చేద్దాం అనేది చెప్పండి? డబుల్ బెడ్ రూం ఇచ్చామని, చదువుకు స్కూల్ పెడుతున్నామని, ఈటెల కు వచ్చిన దుఃఖం ఏంది? వాళ్ళు బాగుండటం ఇష్టం లేదా? అని ప్ర‌శ్నించారు. చెరువుల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే అని, నాలా లాపై నిర్మాణాలు తొలగించాల్సిందే అని స్ప‌ష్టం చేశారు. మూసీ బాధితులకు ఇల్లు తో పాటు, ఖర్చులకు రూ.15 వేలు ఇచ్చామ‌న్నారు.

- Advertisement -

సికింద్రాబాద్ లోని సిఖ్ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ కార్యక్రమాన్ని నేడు ఆయ‌న‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నల్గొండలో అడుగు పెట్టండి.. మూసీ తో పంటలు ఎంత కాలుష్య‌మ‌వుతున్నాయ‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. . నల్గొండ ప్రజా కోసం ప్రక్షాళన చేయాలన్నారు. తాను భవిష్యత్ కోసం ఆలోచన చేస్తున్నాని, అయితే కేటీఆర్.. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సబితమ్మ పేద అరుపులు అరవకు అని అన్నారు. మీ ముగ్గురు కొడుకుల ఫాం హౌస్ లు లేవా..? అని ప్రశ్నించారు. మీ ఫామ్‌ హౌస్ ల లెక్క కూడా ఉందని చెప్పారు. హరీష్ రావుకు అమీన్ పూర్ లో ఫాం హౌజ్ ఉంది కదా? అది అక్రమం కాదా..? అని ప్రశ్నించారు.

గ‌త ప్ర‌భుత్వం చేసింది… త‌ప్పులు.. అప్పులు

గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అని, ఒకటి తప్పులు.. రెండోది అప్పులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అప్పులు..తప్పులతో రాష్ట్రం నిండా మునిగిందని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి ఫాం హౌస్ కూలగొట్టాలా వద్దా..? అని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో.. బావ బామ్మర్ది లు ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు రాజ‌కీయం చేస్తార‌ని, మూసీ పేదలకు ఇండ్లు ఇవ్వాలా వద్దా? అని ప్రశ్నించారు. నమ్మి మోస పోయినా పేదలకు పరిహారం ఇద్దాం రండి అన్నారు.

మోదీ ద‌గ్గ‌ర‌కు పోదాం… ఈట‌ల రావాలి..
ఎంపీగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌పై రేవంత్ డిప‌డ్డారు. ప్ర‌ధాని మోదీ సబర్మతి రివర్ అభివృద్ధి చేసుకోవచ్చు.. తెలంగాణ‌లో మూసీ న‌ది అభివృద్ధి చేస్తాముంటే… చేయొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. కేటీఆర్..హరీశ్‌ ముందు రోజు మాట్లాడతార‌ని, ఆ మ‌రుచ‌టి రోజు వాళ్లు మాట్లాడిన కాగితం పట్టుకుని ఈటెల రాజేంద‌ర్ వ్యాఖ్య‌లు చేస్తార‌ని చెప్పారు. పార్టీ మారినా పాత పార్టీ గత్తర వాసన పోవడం లేదని విమ‌ర్శించారు.

సెక్ర‌టేరియ‌ట్‌కు రండి… చెరువులు ఆక్ర‌మించుకునేదెవ‌రో చ‌ర్చిద్దాం
కేటీఆర్‌, హ‌రీశ్ ఇద‌రూ సెక్ర‌టేరియ‌ట్‌కు రండి అని, చెరువు ఎవ‌రు ఆక్ర‌మించుకున్నారో చ‌ర్చిద్దామ‌ని రేవంత్ అన్నారు. హైదరాబాద్ చెరువుల లెక్క తీద్దామని, ఎవరు ఆక్రమణ చేశారు.. ఎవరు వెంచర్ వేశారు.. అనేది లెక్క తీద్దాం అని అన్నారు. తాగు నీరు అందించే చెరువుల్లో ఫాం హౌస్ కట్టుకున్నారని మండిపడ్డారు.

వన్ స్టేట్-వన్ కార్డ్ తో మరో కొత్త విప్లవం ….


తెలంగాణ‌లో వన్ స్టేట్-వన్ కార్డ్ తో మరో కొత్త విప్లవానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలుకుతోందని, ఫ్యామిలీకి ర‌క్ష‌ణ కార్డుగా డిజిట‌ల్ కార్డు ఉంటుంద‌ని రేవంత్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఈ పైలట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ పైలట్ సర్వేను ఐదు రోజుల్లో పూర్తి చేసి.. ఈ విధానంలో గల మార్పులు చేర్పులను గమనించి, రాష్ట్రమంతటా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 30 శాఖల సమాచారాన్ని క్రోడీకరించి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

ఇంటి మ‌హిళ‌యే ఇంటి య‌జ‌మానురాలి

మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. అందులో భాగంగానే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఆ ఇంటి మహిళను ఇంటి యజమానురాలిగా ఉంచుతామ‌ని సీఎం తెలిపారు. రేషన్ కార్డులు వేరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వేరని.. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో కుటుంబంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలతోపాటు ఆ ఇంట్లో వారు పొందుతున్న పథకాలన్నింటి వివరాలు ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement