Wednesday, November 27, 2024

TG – ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులపై ప్ర‌భుత్వం పునఃప‌రిశీల‌న

ఇప్ప‌టికే అక్క‌డ ప‌నులు నిలిపివేయించిన క‌లెక్ట‌ర్
ఆందోళ‌న చేస్తున్న దిలావ‌ర్ పూర్ ప్ర‌జ‌ల‌తో చ‌ర్చ‌లు
గ‌త ప్ర‌భుత్వ ఇచ్చిన అనుమ‌తుల‌పై రేవంత్ స‌ర్కార్ పరిశీల‌న‌
అవ‌స‌ర‌మైతే మొత్తం ప‌రిశ్ర‌మ‌ను ర‌ద్దు చేసే దిశ‌గా అడుగులు

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులను పునఃప‌రిశీలించాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యించింది.. ఇక్క‌డ ఈ ప‌రిశ్ర‌మ వ‌ద్దంటూ గ‌త కొన్ని రోజులుగా నాలుగు గ్రామాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు.. దీంతో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ ను ప్ర‌భుత్వం ఆదేశించింది. అవసరమైతే ఇథనాల్‌ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ఆలోచనలో కూడా రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.

కలెక్టర్‌ కీలక ఆదేశాలు…

ఆందోళన చేస్తున్న దిలావర్‌పూర్‌ గ్రామస్థులతో కలెక్టర్‌ అభినవ్ నేడు చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు కలెక్టర్‌ తెలిపారు. ఇథనాల్‌ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చామ‌ని గ్రామ‌స్థుల‌కు కలెక్టర్ వివ‌రించారు. దీంతో గ్రామస్థులు ఆందోళనను విర‌మించే దిశ‌గా సాగుతున్నారు.. ఈ ప‌రిశ్ర‌మ ప‌రిధిలోకి గ్రామ‌స్థుల‌తో ఆందోళ‌న కారులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.. క‌లెక్ట‌ర్ ఇచ్చిన హామీని వారికి వివ‌రించారు.. దీంతో ఆందోళ‌నను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం

- Advertisement -

.

Advertisement

తాజా వార్తలు

Advertisement