Sunday, September 22, 2024

TG – సింగ‌రేణి కార్మీకులను మోసం చేశారు – బిఆర్ఎస్ ధ్వ‌జం..

హైద‌రాబాద్ : సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని రేవంత్ స‌ర్కార్ బొగ్గుపాలు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. ముఖ్య‌మంత్రి రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంద‌ని ఆ పార్టీ నేత స‌తీష్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ల‌ర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లించిన బోన‌స్ వివ‌రాల‌తో ఒక పోస్ట్ చేశారు. . కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచిందని మండిప‌డ్డారు. సింగరేణి లాభాలను భారీ మొత్తంలో (33%) కార్మికులకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ఈ సంవత్సరం లాభాలు పెరిగినప్పటికీ కార్మికులకు మాత్రం అందించింది మాత్రం 16.9% అని వివ‌రించారు…. గత 15 ఏళ్లలో ఈసారే అత్యంత తక్కువ మొత్తంలో లాభాలు కార్మికులకు అందాయని అయ‌న చెప్పారు.


రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో రూ.4,071 కోట్ల నికర లాభాలు వచ్చినట్టు యాజమాన్యం పేర్కొన్నది. ఇందులో నుంచి సింగరేణి భవిష్యత్తు ప్రణాళిక కోసం 2,289 కోట్లను పక్కన బెట్టినట్టు సెలవిచ్చిందని, మిగతా రూ.2,412 కోట్ల లాభాల నుంచే కార్మికులకు 33 శాతం కింద రూ.796 కోట్లను బోనస్‌గా అందజేస్తామని ప్రకటించింది.

- Advertisement -

సంస్థ యాజమాన్యం పక్కన పెట్టిన 2,289 కోట్లకు 33 శాతం వాటాలు ఎగ్గొడుతున్నదని నేతలు ఆరోపిస్తున్నారు. గత పదేండ్లలో నికర లాభాల్లో కార్మికుల బోనస్‌ను పరిశీలిస్తే ఈసారే అతి తక్కువ బోనస్‌ వచ్చిందని వారు తేల్చి చెప్తున్నారు. 2022-23లో 32 శాతం బోనస్‌ అంటే రూ.2,222 కోట్లకు రూ.711 కోట్లను సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా అందజేసింది. ఇప్పుడు 50 శాతం లాభాలను పక్కనబెట్టి, మిగతా 50 శాతానికే బోనస్‌ను ప్రకటించింది. దీంతో కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగిందని స‌తీష్ పేర్కొన్నారు.

సంవత్సరాల వారీగా సింగరేణి కార్మికులకు అందిన బోనస్

2023-24
వచ్చిన లాభాలు – రూ. 4,701 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 796 కోట్లు
వాటా శాతం – 16.90 %

2022-23
వచ్చిన లాభాలు – రూ. 2,222 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 700 కోట్లు
వాటా శాతం – 32 %

2021-22
వచ్చిన లాభాలు – రూ. 1227 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 368 కోట్లు
వాటా శాతం – 30 %

2020-21
వచ్చిన లాభాలు – రూ. 272.64 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 79.07 కోట్లు
వాటా శాతం – 29 %

2019-20
వచ్చిన లాభాలు – రూ. 993 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 278 కోట్లు
వాటా శాతం – 28 %

2018-19
వచ్చిన లాభాలు – రూ. 1765 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 494 కోట్లు
వాటా శాతం – 28 %

2017-18
వచ్చిన లాభాలు – రూ. 1212 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 327 కోట్లు
వాటా శాతం – 27 %

2016-17
వచ్చిన లాభాలు – రూ. 395 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 99 కోట్లు
వాటా శాతం – 25 %

2015-16
వచ్చిన లాభాలు – రూ. 1066 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 245 కోట్లు
వాటా శాతం – 23 %

2014-15
వచ్చిన లాభాలు – రూ. 490 కోట్లు
కార్మికులకు పంచిన వాటా – రూ. 103 కోట్లు
వాటా శాతం – 21 %

Advertisement

తాజా వార్తలు

Advertisement