హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన నేటి మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ఆర్ఓఆర్ 2024 బిల్లు, పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా ఐదు ఆర్డినెన్సులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
మంత్రి వర్గం ఆమోదంతో ఆర్ఓఆర్ 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ పని దినాలు, బిజినెస్‌ను బీఏసీ ఖరారు చేయనుంది