Sunday, December 1, 2024

TG – సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వేస్తాం – రేవంత్

హైదరాబాద్: రైతు భరోసాను కొనసాగిస్తామని ,. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వారి ఖాతాలలో వేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ,ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు..

వరికి రూ.500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం వడ్డించేలా ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పులమయంగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఈ ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు. అసెంబ్లీలో విధి విధానాల పై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. సన్నాలకు రూ. 500బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు.

- Advertisement -

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులామని విమర్శించారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చిద్దాం రావాలని సీఎం సవాల్ విసిరారు.

తెలంగాణను అప్పుల్లో ముంచారు…

రాష్ట్రంపై రూ. 7లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీకే కట్టాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి గతంలో ఎవరూ బయటపెట్టలేదని చెప్పారు.

ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొదని అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అధైర్యపడకుండా అమలు చేస్తామని అన్నారు. రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.2023 వానాకాలంలో రైతు బంధును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. రైతులు సన్న వడ్లు పండించాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.తాము అధికారంలోకి రాగానే రూ. రూ. 7625 కోట్లు రైతుబంధు నిధులు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

రైతు భరోసాను కొనసాగిస్తాం..”రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది కాంగ్రెస్ ఒక్కటే. నెహ్రూ నుంచి వైఎస్సార్ దాకా రైతులే మా ఎజెండా. కేసీఆర్ బకాయి పెట్టిన రైతుబంధును మేం చెల్లించాం. అధికారంలోకి రాగానే రూ.7,625కోట్ల రైతుబంధు నిధులు చెల్లించాం. ఆగస్టు 15నాటికి 22.22లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ఆగస్టు 15నాటికి రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమచేశాం. నిన్న 3.14లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ2,747కోట్లు వేశాం. ఇప్పటివరకు 25.35 లక్షలమంది రైతుల ఖాతాల్లో.. రూ.21వేల కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ రైతులను మోసం చేసింది. రైతు భరోసాను కొనసాగిస్తాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తాం.అని చెప్పారు రేవంత్.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement