హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుంది. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. వ్యవసాయం రాష్ట్ర ఆర్థికరంగానికి వెన్నెముక. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశాం. 25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు మాఫీ చేశాం. ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం. 2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్ను ధ్యానం ఉత్పత్తి చేశాం. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4500 కోట్లు ఆదాచేశామని చెప్పారు