Sunday, November 3, 2024

TG – జేఎన్ టీయూ కళాశాలలో చట్నీ పాత్రలో ఎలుక – అడిషనల్ కలెక్టర్ తనిఖీలు

జోగిపేట, జులై9(ప్రభన్యూస్): చౌటకూర్ మండల పరిధిలోని జేఎన్ టీ యూ ఇంజనీరింగ్ కళాశాలలోని హాస్టల్ లో సోమవారం రాత్రి విద్యార్థులకు వడ్డించే టిఫిన్ సమయంలో చట్నీ పాత్రలో చిట్టేలుక ప్రతిక్షమైంది. చట్నీ పాత్రలో ఉన్న ఎలుకను చూసి విద్యార్థులు ఆందోళన చెందారు. హాస్టల్ లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఈనెల 3న కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఫుడ్ కాంట్రాక్టర్ ను వెంటనే మార్చాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ హామీతో ఆందోళన విరవించుకున్న విద్యార్థులు తాజాగా మళ్లీ సోమవారం రాత్రి టిఫినీ సమయంలో చట్నీ పాత్రలో ఎలుక కనిపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు చట్నీ పాత్రలో చిట్టి ఎలుక అందులో తిరుగుతూ కనిపించడంతో అక్కడే ఉన్న విద్యార్థులు వారి సెల్ ఫోన్ లో వీడియోలు చిత్రికాయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో చట్నీలో ఆ ఎలుక ప్రత్యక్షం వైరల్ గా మారింది.

ఈ సంఘటన తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీవో పాండు తో కలిసి మంగళవారం జేఎన్టీయూ కళాశాలలోని హాస్టల్ ను సందర్శించి ఫుడ్ కు సంబంధించిన వస్తువులను ఆమె పరిశీలించారు. హాస్టల్లోని వన్డే పాత్రలు, పరిశుభ్రత లేకపోవడంతో కాంట్రాక్టర్ పై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి తీరు మార్చుకోవాలని చెప్పిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టర్ ను మార్చుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నర్సింహాను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఆదేశించారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement