Wednesday, November 6, 2024

TG – అరుదైన గధేగల్లు శాసనం – ముధోల్ లో ల‌భ్యం

-ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, బాస‌ర : నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో అరుదైన గధేగల్లు శాసనాన్ని తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ముధోల్ జ‌ట శంక‌ర ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌నివారం ఆ బృందం గుర్తించింది. అవి ఎలా వ‌చ్చాయ‌న్న‌ది ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌రాద‌ని తెలంగాణ బృందం స‌భ్యుడు, ఉపాధ్యాయుడు బల‌గాం రామ్ మోహ‌న్ తెలిపారు.

12వ శ‌తాబ్దానికి చెందిన‌వి…ఈ శాస‌నాలు 12 వ శతాబ్దానికి చెంద‌న‌వి అని భావిస్తున్నట్లు బృంద సభ్యుడు ఉపాధ్యాయుడు బలగం రామ్ మోహన్ తెలిపారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయని, తెలంగాణలో ఇదివరకు రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించినట్లు కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

మహరాష్ట్ర, గోవా, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తున్నాయ‌ని, ఇవి దాన శాసనాలని చెప్పారు.తెలుగు, క‌న్న‌డంలో లిపిముధోల్ లో దొరికిన ఈ గధేగల్లు మీద కూడా అక్షరాలు అరిగిపోయిన 6 లేదా 7 వరుసల్లో రాయబడిన ఒక అస్పష్ట శాసనం ఉంది.

- Advertisement -

లిపి తెలుగు, కన్నడం పోలినట్లు క‌నిపిస్తుంది. ఈ గధేగల్లు పై మొదటి అంతస్తులో సూర్య చంద్రులు తరువాతి అంతస్తులో అస్పష్ట శాసనం కింద అంతస్తులో లింగం, నంది, స్త్రీతో సంభోగం చేస్తున్న గాడిద బొమ్మలు ఒకదాని కింద ఒకటి చెక్కి ఉన్నాయి. సాధారణంగా గధేగల్లులు దాన శాసనాలు గా ఉంటాయి కాబట్టి ఇది కూడా దాన శాసనం అయి ఉండవచ్చు అని రామ్ మోహ‌న్ తెలిపారు.

ఈ దానాన్ని తప్పినవారు పాపాన్ని మూట గట్టుకుంటారు అని శాపోక్తులు ఉంటాయ‌ని అన్నారు. దానికి హెచ్చరిక గా శాసనం కింద స్త్రీతో గాడిద సంభోగిస్తున్నట్లు చెక్కబడడం వీటి ప్రత్యేకత‌ని పేర్కొన్నారు. నాటి పాలకుల ఆజ్ఞ లేదా శాసనాన్ని పాటించని వారు విధేయత చూపని వారి ఇంటిలోని స్త్రీని గాడిదతో సంభోగింపజేసే శిక్ష వేస్తారని వేసే శాసనమే గధేగల్లు.అశ్లీల బొమ్మ‌గా పారేసి ఉండొచ్చు . ఇక్కడ ముధోల్ లో కూడా గ్రామస్తులు దీనిని అశ్లీలమైన బొమ్మగా భావించి పారేశి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

స్థానికుడు రెవెన్యూ ఉద్యోగి సాయినాథ్, కండక్టర్ కందొల్ల భూమేశ్ సహాయంతో కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు ఉపాధ్యాయుడు బలగం రామ్ మోహన్ దీనిని గుర్తించారు. దీని ప్రాశస్త్యాన్ని గత సర్పంచ్ వెంకటాపురం రాజేందర్ గారికి వివరించగా దాన్ని జాగ్రత్తగా నిల‌బెట్టారు. పురాతన ఆనవాళ్లు కాపాడుకోవడం మన బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement