హైదరాబాద్ – చేనేతల అమ్మకాలకు, నేత కుటుంబాల అభివృద్ధి కి ఐక్యవేదిక లోని ప్రతి సభ్యుడు కృషి చేయాలి అని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఆదివారం హయత్నగర్ లో జరిగిన ఐక్యవేదిక కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోముఖ్య అతిధి గా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించి నేతన్నల కుటుంబాలకు బాసటగా నిలవాలి అని అది అందరి బాధ్యతగా భావించాలి అని అన్నారు
ఈ సందర్భంగాచేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ని అభినందిస్తూ వేదిక అభివృద్ధి కి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని భరోసా ఇచ్చారు అనంతరంకార్యవర్గ సభ్యుల చేత బాధ్యత ల ప్రమాణ స్వీకారం చేపించి వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజ్ కుమార్,ప్రముఖ న్యాయ వాది రాపోలు భాస్కర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జతార రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సామల స్వప్న మనోహర్ తుర్కయంజాల్ రంగారెడ్డి చేనేత ఐక్య వేదిక నాయకులు పద్మశాలి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.