Saturday, September 7, 2024

TG – రూ.2 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్ … హీరోయిన్ ర‌కుల్ సోదరుడు అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్ నగరంలో మ‌రోసారి డ్రగ్స్ కలకలం రేగింది. సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నలుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయిదుగురు నైజీరియన్లతోపాటు వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన అయిదుగురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. ఇందులో రకుల్ సోదరుడితో పాటు సినీరంగ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ నుంచి వీరంతా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు స‌మాచారం. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement