Friday, November 22, 2024

TG | ఆరోగ్యశ్రీ చికిత్సల ధరల సవరణ..

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించింది. ఆరోగ్యశ్రీ లో ఉన్న‌ 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30 జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరలు మారలేదు. అదే సమయంలో ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 చికిత్సలను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఆరోగ్యశ్రీలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలతో ప్రభుత్వంపై రూ.438 కోట్ల భారం పడుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి రూ.600 కోట్ల అదనపు వ్యయం పెరిగిందన్నారు. కాగా, ఆరోగ్యశ్రీతో 79 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని… ఈ కొత్త విధానాలతో మరో లక్షన్నర కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement