Monday, July 1, 2024

TG – ప్ర‌జా భ‌వ‌న్ లో ప్ర‌జా వాణి….494 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

హైదరాబాద్, జూన్ 28:: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను కలిసి వినతిపత్రాలు అందచేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 494 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 125, హౌసింగ్ కు సంబంధించి 43 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖ కు సంబందించి 71, హోం శాఖకు సంబందించి 45 దరఖాస్తులు, పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కు సంబందించి 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement