Wednesday, November 6, 2024

TG – మళ్లీ ప్రారంభమైన ప్రజా వాణీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే గురువారంతో ఎలక్షన్‌ కోడ్‌ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ జీ చిన్నారెడ్డి తెలిపారు.గతంలో వలే మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు.

దీంతో ప్రజా భవన్ వద్దకు ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు భారీ గా చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement