Wednesday, October 23, 2024

TG – కీచక ఖాకీ పై పొక్సో కేసు

కాజీపేట్ పొలీస్ స్టేషన్‌లో సి ఐ రవికుమార్‌పై పొక్సో కేసు నమోదైంది. హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటూ..అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత కుటుంబీకులు నేడు ఫిర్యాదు చేశారు.

పలు మార్లు లైంగిక దాడికి యత్నించినట్లు పేర్కొన్నారు. కాజీపేట్ పొలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవి కుమార్ గతంలో మామునూర్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement