Thursday, November 21, 2024

TG – ఎంబీబీఎస్​ సీటొచ్చినా కూలీ పనులకు!

బుక్స్​, డ్రెస్సెస్​కు డబ్బుల్లేవ్​ కాలేజీ ఫీజుకు కూడా ఇబ్బందే
నీట్​లో మంచిమార్కులు సాధించిన శివ‌గౌత‌మి
అయినా తప్పని ఆర్థిక ఇబ్బందులు
దాతలు ఆదుకుంటేనే డాక్టర్​ అయ్యే చాన్స్​

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్​: సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతికి ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు వెళ్తోంది. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. నీట్‌లో 507 మార్కులు సాధించి మంచిర్యాల మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. బుక్స్‌, డ్రెస్సెస్‌, ఫీజులకు ₹1,50,000 ఖర్చు అవుతుండగా.. తన దగ్గర అంత పెద్ద మొత్తం లేకపోవడంతో ఇంకా కాలేజీలో జాయిన్​ కాలేదు. అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో కూలీ పనులకు వెళ్తోంది. మనసున్న దాతలు ఆదుకుని గౌతమి ఎంబీబీఎస్​ పూర్తి చేసేలా సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement