బుక్స్, డ్రెస్సెస్కు డబ్బుల్లేవ్ కాలేజీ ఫీజుకు కూడా ఇబ్బందే
నీట్లో మంచిమార్కులు సాధించిన శివగౌతమి
అయినా తప్పని ఆర్థిక ఇబ్బందులు
దాతలు ఆదుకుంటేనే డాక్టర్ అయ్యే చాన్స్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతికి ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు వెళ్తోంది. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. నీట్లో 507 మార్కులు సాధించి మంచిర్యాల మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. బుక్స్, డ్రెస్సెస్, ఫీజులకు ₹1,50,000 ఖర్చు అవుతుండగా.. తన దగ్గర అంత పెద్ద మొత్తం లేకపోవడంతో ఇంకా కాలేజీలో జాయిన్ కాలేదు. అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో కూలీ పనులకు వెళ్తోంది. మనసున్న దాతలు ఆదుకుని గౌతమి ఎంబీబీఎస్ పూర్తి చేసేలా సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.