Saturday, November 16, 2024

TG – కార్ రేసింగ్ తో తెలంగాణ‌కు ఏం లాభం – కేటీఆర్‌ను నిల‌దీసిన మంత్రి పొంగులేటి

త‌ప్పు చేస్తే కేసీఆర్‌తో స‌హా అంద‌రూ శిక్ష అనుభ‌వించాల్సిందే
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్ర‌కారం కుల‌గ‌ణ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఖ‌మ్మం : కార్ల రేసింగ్‌తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ నాయకుడైనా శిక్ష అనుభవించక తప్పదని తేల్చి చెప్పారు. తప్పులు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురంలో సమగ్ర కుటుంబ సర్వేని పొంగులేటి ప్రారంభించారు. కేక్ కట్ చేసి సమగ్ర కుటుంబ సర్వేని, పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, కవిత ఎవరైనా సరే తప్పు చేసినట్టు తేలితే శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్‌ పాదయాత్రను స్వాగతిస్తామని తెలిపారు. తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్ర‌కారం
ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. 75 కాలమ్స్ తో కులగణన సర్వే చేస్తున్నారని తెలిపారు. ఆర్ధికంగా భారమైన కులగణన క్షుణ్ణంగా చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు నుంచే సర్వే మొదలైందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ఏమేం అవసరం ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ కి 170 ఇళ్ల వరకు సర్వే చేస్తారని తెలిపారు. ప్రతిరోజూ చేసిన సర్వేని ఆన్లైన్ లో నమోదు చేస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడైనా కులగణన చేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలన్నారు. కులగణనను అధికారులు బాధ్యతగా నిర్వహించాలన్నారు.

విద్యార్థినుల‌తో క‌లిసి భోజ‌నం

- Advertisement -


ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆనంతనగర్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. అక్క‌డ విద్యార్థినులతో ఆయ‌న మధ్యాహ్న భోజనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement