Thursday, November 21, 2024

TG – రైతుల ముసుగులోదాడి చేయ‌డం స‌రికాదు – మంత్రి పొంగులేటి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : రైతుల ముసుగులో అధికారుల‌పై దాడి చేయ‌డం స‌రికాద‌ని రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది ఈ ప్ర‌భుత్వ ఉద్దేశం కాద‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను విన‌డానికి, ప‌రిష్క‌రించ‌డానికి ఈ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంద‌ని చెప్పారు. ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంద‌న్నారు. ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు గానే ..రేపు రాజ‌కీయ నాయ‌కుల‌పైనా, ప్ర‌జ‌ల‌పైనా జ‌రిగితే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్ర‌శ్నించారు. ఎవ‌రిపైనా దాడి జ‌రిగినా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

క‌లెక్ట‌ర్‌పైనా హ‌త్యాయ‌త్నానికి కుట్ర‌

జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నార‌ని మంత్రి పొంగులేటి అన్నారు. అధికారుల మీద దాడి అనేది మ‌న మీద మ‌నం దాడి చేసుకున్న‌ట్లే అని అన్నారు. కుట్ర పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నార‌ని ఆరోపించారు.

గులాబీ గూండాల కుట్ర‌
రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మంత్రి పొంగులేటి అన్నారు. గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్న‌ట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వ‌స్తారు? అని ప్ర‌శ్నించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారం వెల‌గ‌బెట్టిన‌నాడు ఇదే ప‌ద్ద‌తి చేశారా? అని నిల‌దీశారు.

ఆనాడు మీరు చేసిందేమిటి?
ఏం త‌ప్పుచేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టార‌ని పొంగులేటి ప్ర‌శ్నించారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించార‌ని గుర్తు చేశారు. పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా? అని నిల‌దీశారు. ఎగిసి ఎగిసి ప‌డుతున్న కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా? అని అంటూ ల‌గ‌చ‌ర్ల‌లో ఆ ప‌రిస్ధితి లేదు క‌దా? అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement