Wednesday, November 13, 2024

TG – డాగ్ స్క్వాడ్ “చీతా” మృతి… సంప్రదాయ పద్ధతిలో ఖననం

జన్నారం,జులై 9 (ప్రభ న్యూస్): డాగ్ స్క్వాడ్ చీతా మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. జర్మనీ షెఫర్డ్ చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కుక్క పేరే చీతా. ఆ పేరు వింటేనే స్మగ్లర్ల గుండెల్లో పరుగులు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కు 2018 డిసెంబర్ 15న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ప్రత్యేక శిక్షణ పొందిన స్థానిక అటవీ బీట్ అధికారులు శ్రీగాద శ్రీనివాస్, జాడి సత్యనారాయణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జర్మనీ షెఫర్డ్ చీతా (కుక్క)ను ఇక్కడికి తీసుకొచ్చారు.

ఆ చీతా గుండెపోటు గురై సోమవారం మృతి చెందింది.ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ చే పోస్టుమార్టం నిర్వహించి స్థానిక అటవీ శాఖ సముదాయ ప్రాంతంలో సంప్రదాయ పద్ధతిలో తాళ్ళపేట,జన్నారం ఇన్చార్జి రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్ ఎం.డి హఫీజోద్దీన్, డిప్యూటీ రేంజ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తిరుపతి, హైమావతి,మమత శ్రీనివాస్,రైమోద్దీన్, డివిజన్ సూపరిండెంట్ షమీమోదీన్, అసిస్టెంట్ రవీందర్ లు సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు.

- Advertisement -

ఆచీతా ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులను, చిరుతపులను వేటాడిన వేటగాళ్ళను పట్టుకుంది. కలప స్మగ్లర్లను కూడా ఆ కుక్క ఎంతో చాకచక్యంగా గుర్తించకలిగింది. జన్నారం డివిజన్లోని బొమ్మెనలో ఓ దుప్పిని వేటాడిన వేటగాళ్ళను పసిగట్టి పట్టుకుంది.ఈ సంఘటన అప్పుడు ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగింది.ఆ తర్వాత లింగాపూర్ మండలంలోని మామిడిపెళ్లిలో చిరుతపులిని చంపిన వేటగాళ్ళను నిజామాబాద్ లో పసిగట్టి పట్టుకుంది.ఆ తరువాత మంచిర్యాలలోని ర్యాలీగడ్ పూర్ లో ఓ చిరుతపులిని చంపి, గోళ్లను ఎత్తుకెళ్ళిన వేటగాళ్లను పసిగట్టి పట్టుకుంది.

ఇలా ఆ చీతా పలు వన్యప్రాణుల కేసులోనూ , కలప స్మగ్లర్ల కేసుల్లోనూ అటవీఅధికారులకు ఎంతో సహకరించడంతో కేసులను చేదించారు. దీంతో ఆ కుక్క పేరు వింటేనే స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేయి. అటవీ కేసు విషయంలో ఆ కుక్కను పట్టుకొని అధికారులు ఆ ప్రాంతానికి వచ్చిందంటే చాలు ఎంతటి కరుడుగట్టి నేరగాలైనా చేసిన నేరాన్ని తప్పకుండా ఒప్పుకునేవారు. ప్రస్తుతం ఆ చీతా అకాల మరణంతో అటవీ అధికారుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement