Wednesday, December 4, 2024

TG నెరవేరిన చిరకాల స్వప్నం ..పెద్దపల్లి కి బస్సు డిపో మంజూరు

.. మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే విజయరమణ

పెద్దపల్లి, ఆంధ్రప్రభ – దశాబ్దాల కాలంగా నెరవేరని పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నం ఆర్టీసీ బస్ డిపో మంజూరయింది. ప్రతి ఎన్నికలకు ముందు అన్ని పార్టీల అభ్యర్థులు ఇతర హామీలతో పాటు ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం, ఐదేళ్లు గడిచిపోవడం దశాబ్దాల కాలంగా నడుస్తూ వస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు కచ్చితంగా బస్ డిపో ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గెలిచిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి పలుమార్లు ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని విన్నవించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి ప్రజల చిరకాల స్వకమైన బదిలీపు మంజూరు చేయించి మాట నిలుపుకున్నారు. బస్సు డిపో ఏర్పాటుతో పెద్దపల్లి ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోకి కూడా బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది. పెద్దపల్లి లో పలు గ్రామాల నుండి మండల కేంద్రాలకు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులూ తీర్చడానికి అహర్నిశలు శ్రమించి సిఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించి బస్ డిపో మంజూరు చేయించుకున్నారు.

- Advertisement -

బస్ డిపో మంజూరుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజల ప్రక్షాన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. జీవో నంబర్ 915 ద్వారా ప్రభుత్వం పెద్దపల్లికి బస్ డిపో మంజూరు చేయడంతో పాటు 4.31 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్ లో అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గత 20 ఏళ్లుగా కాలంలో ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉన్న బస్సు డిపో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో గడవకముందే మంజూరు కావడం, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో బైపాస్ రోడ్డుతో పాటు, 50 పడకాల ప్రభుత్వాసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ కోసం నిధులు మంజూరయ్యాయి. దీంతోపాటు వందల కోట్ల రూపాయల నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరు కావడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement