హైదరాబాద్: .ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.కాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ వచ్చిన పవన్ మదాపూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు
నేటి ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యామిలీ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నటుడు నాగబాబు.. బన్నీ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అల్లు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
- Advertisement -