కరీంనగర్ ఆంధ్రప్రగ్రామపంచాయతీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. గురువారం కరీంనగర్ నుండి తాహెర్ కొండాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో చెర్ల భుత్కూరు వద్ద గ్రామ పంచాయతీ సిబ్బందితో మాట్లాడారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
. వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని,జీతాలు సరిగా రావడం లేదని తెలియజేయడం గ్రామ కార్యదర్శి ,స్పెషల్ ఆఫీసర్ తో మాట్లాడి వారి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.