Home తెలంగాణ‌ TG – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట … అర్ధరాత్రి బెయిల్ మంజూరు

TG – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట … అర్ధరాత్రి బెయిల్ మంజూరు

0
TG – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట … అర్ధరాత్రి బెయిల్ మంజూరు

హైదరాబాద్‌: హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. తాజాగా హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది . రూ.5 వేల జరిమానా, ఇద్దరు పూచికత్తుతో హుజురాబాద్ బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. కాగా, గురువారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి రిమాండ్ కు తరస్కరిస్తూ, ఏడేళ్ల లోపు శిక్ష అభియోగాలు పాడిపై నమోదు కావడంతో ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

అనంతరం పాడి మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు హుజూరాబాద్‌ ప్రజల కోసం ప్రశ్నిస్తానన్నారు. ప్రజల ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

Exit mobile version