Wednesday, November 20, 2024

TG – పిఎసి సమావేశంలో గ‌రం గ‌రం – అరికెపూడిపై విరుచుకుపడ్డ బిఆర్ఎస్ సభ్యులు

అరికెపూడి నియామ‌కంపై బిఆర్ఎస్ భ‌గ్గు
స‌మావేశంలోనే అరికెపూడిని నిల‌దీత
నిర‌స‌న వ్య‌క్తం చేసి, మీటింగ్ బ‌హిష్క‌ర‌ణ‌
రేవంత్ పాల‌న‌లో అన్ని బుల్డోజ్ రాజ‌కీయాలే

హైదరాబాద్‌: తెలంగాణ‌ అసెంబ్లీలో నేడు పీఏసీ సమావేశం నిర్వ‌హించారు.. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ స‌భ్యులు పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. స‌భ్యులుగా ఉన్య‌న వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన స‌మావేశంలో వ్య‌క్తం చేసి,అనంత‌రం మీటింగ్ ను బాయ్ కాట్ చేశారు.. .

అనంత‌రం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్, ర‌మ‌ణ‌లు మీడియాతో మాట్లాడారు.. పీఏసీ చైర్మన్‌ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సంప్రదాయమని వేముల అన్నారు. గ‌తంలో పీఏసీ చైర్పన్ విప‌క్ష పార్టీల‌కు చెందిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎనమల రామకృష్ణుడు నాడు పీఏసీ చైర్మన్లుగా ఉన్నార‌న్నారు.. లోక్‌సభలో కూడా గత పదేండ్లుగా ప్రతిపక్ష నాయకులే పీఏసీ చైర్మన్లుగా ఉన్నార‌ని గుర్తు చేశారు… ఇవాళ కూడా పీఏసీ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించామ‌ని చెప్పారు…

- Advertisement -

అరికెపూడి గాంధీ ప్రతిపక్ష సభ్యుడేనని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారన్నారు. ఫిరాయింపుదారులతో సాక్షాత్తూ సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశాలు నిర్వహించార‌నిఅ అంటూ జీవన్‌రెడ్డి లేఖపై శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని, ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారని మధుయాష్కి గౌడ్‌ అన్నారని గుర్తుచేశారు.

బుడ్డోజ్ రాజ‌కీయాలు పెరిగాయి..

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బుల్డోజ్‌ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. గాంధీని కాంగ్రెస్‌ సభుడిగా ఒప్పుకునే ధైర్యం రేవంత్‌ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దాగుడు మూతలు ఆడుతున్నదని విమర్శించారు. ఆ పార్టీలో నాయకులే లేరా అని నిలదీశారు. గాంధీని అడ్డం పెట్టుకుని రేవంత్‌ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్‌ రమణ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి సూచన మేరకు పీఏసీ చైర్మన్‌ను నియమించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement