మద్దూర్ (ఆంధ్రప్రభ): గ్యాస్ గోదాంలో రాత్రి సమయంలో గ్యాస్ సెలెండర్ పేలిన సంఘటన మద్దూర్ పట్టణ శివారులో చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా గోదాంలో గ్యాస్ సిలిండర్ లో నుంచి కమర్షియల్ సిలిండర్ లోకి గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటన గురించి అధికారి ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆనంద్ వివరణ కోరగా అనే వ్యక్తి
హైదరాబాద్ నుంచి వెంకటేష్ తన దగ్గర పనిచేస్తున్న నారాయణ, నవీన్, కృష్ణ లతో కలిసి కమర్షియల్ సిలిండర్లను హెచ్ పీ గోదాం కు తీసుకువచ్చా రన్నారు. అక్కడ ఏమి చేశారు అనే వివరాలు తెలియదనీ చెప్పారు..
వెంకటేష్ అనే వ్యక్తి వస్తే పూర్తి వివరాలు తెలుస్తుంది అన్ని తెలిపారు. గోదాంలో వాళ్లు గ్యాస్ సిలిండర్లను ఓపెన్ చేసి ఏమి చేశారో తెలియదు.
అక్కడ ఒక గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో గుండుమాల్ గ్రామానికి చెందిన నారాయణ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అభంగపట్నంకు చెందిన నవీన్ చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలిపారు.