Thursday, November 14, 2024

TG – ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర‌ ప్రభుత్వం విఫలం – కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, భువనగిరి : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కేంద్రాల్లోనే 25 రోజులుగా ఉంటే, మొలకలొస్తుంటే రేవంత్‌ సర్కారుకు ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా అని మండిప‌డ్డారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్ చేశారు. అయితే స్విచ్ ఆఫ్ రావడంతో అడిషనల్ కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం

కేంద్ర‌మే చెల్లిస్తోంది…
‘ట్రాన్స్​పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్​, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంద‌ని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంద‌ని చెప్పారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement