Monday, November 25, 2024

TG New Governor – ఆయనే తెలంగాణ కొత్త గవర్నర్ ….

న్యూఢిల్లీ, : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ నియమితులయ్యారు.

ఇక హరిబౌ కిషన్‌ రావు బాగ్డే రాజస్థాన్‌గా గవర్నర్‌గా, , ఓమ్‌ ప్రకాశ్‌ మాథూర్‌ సిక్కిం గవర్నర్‌గా, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ జార్ఖండ్‌ గవర్నర్‌గా, రామెన్‌ దేకా ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా, సీహెచ్‌ విజయ్‌ శంకర్‌ మేఘాలయా గవర్నగా నియమితులయ్యారు .

తెలంగాణ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ మహారాష్ట్ర గవర్నర్‌గా, అస్సాం గవర్నర్‌గా ఉన్న గులాబ్‌ చంద్‌ కటారియా పంజాబ్‌ గవర్నర్‌గా, చంఢీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌గా ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు. లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యకు మణిపూర్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ..

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయనతే ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement