ఆంధ్రప్రభ స్మార్ట్, వరంగల్ : బీఆర్ ఎస్ నేత కేటీఆర్, సినీనటుడు అక్కినేని నాగార్జున, సినీ నటి సమంత కుటుంబాలను వీధిలోకి తెచ్చిన విధంగా చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని మంత్రి కొండా సురేఖ ను డిమాండ్ చేశారు బీఆర్ ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ . లేకుంటా తమ సవాళ్లు స్వీకరించాలని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని హెడ్‌పోస్టాఫీసు సెంటర్ వద్ద బీఆర్ ఎస్ శ్రేణులు నేడు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సురేఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,. క్షమాపణ అడిగితే సరిపోతుందా అని ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు, భాషకు వరంగల్ ప్రజలు ఛీకొడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని కొండాను ఉద్దేశించి అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసి ప్రపంచమంతటా గుర్తింపు పొందిన కేసీఆర్ కుటుంబానికి చెందిన కేటీఆర్‌పై విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ప్రతి మాట పింక్‌బుక్‌లో రాస్తున్నాం…
ప్రతి మాట పింక్ బుక్‌లో నోటు చేస్తున్నామని నరేందర్ అన్నారు. ఈ ప్రాంతంలో రౌడీయిజం చేస్తే పింక్ బుక్‌లో కౌంట్ చేస్తున్నానమని సమయం వచ్చినప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. హైడ్రా అనే డ్రామ కంపెనీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటాకాన్ని ప్రజలు తిప్పికొడతారన్నారు. ఉద్యమాలు తమకు కొత్త కాదని, కేసులు కూడా తమకు కొత్తకాదని అన్నారు. తెలంగాణ సాధనకు ఎన్నో ఉద్యమాలు చేశామని గుర్తించారు.
మహిళలకు ఇచ్చిన గౌరవం ఏమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గౌరవం ఏమిటని నరేందర్ ప్రశ్నించారు. మహిళలకు ఇస్తామన్న బంగారం ఇవ్వలేదని, బతుకమ్మ చీరలు ఇవ్వలేదని అన్నారు. ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అన్యాయం చేస్తే సహించమని హెచ్చరించారు.