కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా బీజేపీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయిందని, ఆ పార్టీలో ఎవరూ ఉండరని అన్నారు. కేసీఆర్‌ను జైలుకు పంపడమే నా మరో లక్ష్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. త్వరలో మరికొంత మంది బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి అని…. జైలుకు వెళ్లే వారిని కాంగ్రెస్ లో చేర్చుకోమని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.