Friday, October 4, 2024

TG – నేడు ముద్ద‌పప్పు బ‌తుక‌మ్మ‌ – మూడో రోజుకు చేరిన పూల పండుగ వేడుకలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బ‌తుక‌మ్మ వేడుక‌లు ఆట పాట‌ల‌తో సంబురంగా సాగుతున్నాయి. మూడో రోజైన శుక్ర‌వారం ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. ఈ రోజు ముద్ద పప్పు, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రేపు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేప బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తారు.

తెలంగాణ జీవ‌న సౌంద‌ర్యం..

ఇలా బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పువ్వులు, కట్ల పువ్వులు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో అలంకరించి ప్రతిరోజు తొమ్మిది రోజుల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మలో భాగంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని జానపద పాటల ద్వారా తెలియజేసేందుకు ఊరూరా ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు అమ్మవారిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ.. మళ్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేసి వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement