Thursday, January 9, 2025

TG – కేటీఆర్ .. నిర్దోషిగా నిరూపించుకో.. ఎంపీ రఘునందన్

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ఫార్ములా ఈ- కారు రేసు కేసులో కేటీఆర్ నిర్దోషిగా నిరూపించుకోవాలని ఎంపీ రఘనందన్ రావు అన్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు పోలీసులు మంచిగా కనిపించారని ఎద్దేవా చేశారు. ఆయా వేదికలపై తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమని ఉపన్యాసాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. గతంతో ప్రతిపక్ష నేతలను అదే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

ఇప్పుడు పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదంటూ ఆరోప‌ణ‌లా?
ఆయ‌న‌ వరకు వచ్చే సరికి కేటీఆర్ కు సీన్ అర్థం కాలేదని.. నేడు పోలీసులపై నమ్మకం లేదంటూ అర్థం లేని ఆరోపణలు కేటీఆర్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసును లొట్టపీసు కేసు అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడెందుకు పోలీసులను చూస్తే భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏ తప్పు చేయకపోతే.. సరైన అధారాలు చూపించి నిర్దోషిగా నిరూపించుకోవాలని రఘునందర్ రావు సవాల్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement