Sunday, June 30, 2024

TG – మైనర్ పై లైంగిక దాడి – నిందితుడిపై పోక్సో కేసు నమోదు

బూర్గంపాడు 24 జూన్ (ప్రభ న్యూస్) మైనర్ బాలికపై 45 సంవత్సరాల వ్యక్తి అత్యాచారయత్నం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బు మండలం సారపాక గ్రామం గాంధీ నగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ప్రముఖ పరిశ్రమ ప్రాంతమైన పరిధిలోని సార్ పాక గ్రామంలో మైనర్ బాలిక ఆడుకుంటున్న సమయంలో ఐటీసీ పరిశ్రమలు క్యాజువల్ గా పనిచేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కుండల్ రామ్ 45 సంవత్సరాలు అనే వ్యక్తి తిను బండారాలు కొనిస్తానని ఆశ చూపి అత్యాచారయత్నం చేశాడు దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

బాధిత మైనర్ బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement