రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు లతో కలిసి పరిశీలించారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లో రైస్ మిల్ లో ఘటన స్థలాన్ని పరిశీ లించి రామగుండం సిపి శ్రీనివాసు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.