నల్గొండ – వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి . రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు చేసిన రైతు రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అందుకు రైతు రుణమాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రుణమాఫీ వల్ల 32 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసే రాష్ట్రాన్ని దివాలా తీసినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు పోతున్నారని అంటూ సిఎంకు ధన్యవాదాలు తెలిపారు.
TG – మరో వారం రోజులలో రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభిస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement