Thursday, January 9, 2025

TG – ప్రజల పక్షపాతి‘ఆంధ్రప్రభ’ – మంత్రి శ్రీధర్ బాబు

ఆంధ్రప్రభ ప్రతినిధి,భూపాలపల్లి : పేద ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల గొంతుకగా ‘ఆంధ్రప్రభ’ దిన పత్రిక నిలుస్తుందని ఐటీ శాఖ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను కాటారం మండల కేంద్రంలో జయశంకర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పావుశెట్టి శ్రీనివాస్, ఆర్సీ ఇన్చార్జ్ అరిగెల జనార్దన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ యాజమాన్యం కి, రిపోర్టర్ లకు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకు అనేక సంచలన కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సామజిక అభివృద్ధిలో ‘ఆంధ్రప్రభ’ కృషి చేస్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రభ కాటారం రిపోర్టర్ కాయిత తిరుపతి, మహాదేవ పూర్ రిపోర్టర్ రెవెల్లి నాగరాజు, మలహార్ రిపోర్టర్ పాలిశెట్టి నరేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement