Friday, November 15, 2024

TG – ఫిలిప్పీన్స్ లో మెద‌క్ వైద్య విద్యార్దిని మృతి

పుట్టిన రోజు నాడే విషాదం
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశ్ లో ఆమె కుటుంబం నివాసం
తండ్రి ట్రాన్స్ కో డిఈ

హైద‌రాబాద్ – డాక్టర్ కావాల‌నే కోరికతో విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల యువతి అనూహ్య మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు కెందిన స్నిగ్ధ వైద్య విద్య అభ్యసించ డానికి ఫిలిప్పీన్స్ వెళ్లింది. అయితే ఆమె పుట్టినరోజు నాడే విగ‌తజీవిగా హ‌స్ట‌ల్ గ‌దిలో ప‌డి ఉండ‌టం ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. వివ‌రాల‌లోకి వెళితే పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో పంచాయతీ పరిధిలో నివాస ముంటున్నారు ట్రాన్స్‌కో డీఈ అమృతరావు కుమార్తె స్నిగ్ధ రెండేళ్ల క్రితం ఎంబీబీఎస్‌ చేసేందుకు ఫిలిప్పీన్స్‌ వెళ్లింది. పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఏం జరిగిందో తెలియదు కానీ పుట్టిన రోజు విషెస్‌ చెబుతామని ఫోన్‌ చేస్తే అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి తరలించిన‌ట్లు స‌మాచారం ఇచ్చారు.. ఆ త‌ర్వాతే ఆమె చ‌నిపోయిన‌ట్లు త‌ల్లిదండ్రుల‌కు ఆ వ‌ర్శిటీ ప్ర‌తినిధులు స‌మాచారం ఇచ్చారు. ఏం జరిగిందో అర్థంకావడం లేదని, తమ పాప చాలా ధైర్యవంతురాలని స్నిగ్ద తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని, తమ బిడ్డ మృతదేహాన్ని ఇంటికి చేర్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌లోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన అధికారులు ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement