Thursday, December 12, 2024

TG – క‌ష్టాల క‌డ‌లిలో కస్తూర్బా పాఠ‌శాల‌లు – అస‌మ‌ర్ధ ప్ర‌భుత్వ పాల‌న‌కు నిద‌ర్శ‌నాలు: ఎమ్మెల్సీ కవిత

క‌ష్టాల క‌డ‌లిలో కస్తూర్బా పాఠ‌శాల‌లు
మోళిక వ‌స‌తుల లేమితో విద్యార్ధినుల క‌ష్టాలు
చ‌లితో దుప్ప‌ట్లు లేక వ‌ణ‌కుతూ నేల‌పైనే నిద్ర‌
శీత‌కాలంలో చ‌న్నీటి స్నానాలు
ఇవ‌న్నీ అస‌మ‌ర్ధ ప్ర‌భుత్వ పాల‌న‌కు నిద‌ర్శ‌నాలు
కాంగ్రెస్ స‌ర్కార్ పై క‌విత ఫైర్ …

హైదరాబాద్‌: కష్టాల కడలిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠ‌శాల‌లు కొట్టుమిట్టాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత . జగిత్యాల జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు దుప్పట్లు లేక చలికి వణికిపోతూ నేలపైనే నిద్రిస్తున్నారని, చన్నీటితో స్నానం చేస్తున్నారన్నారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు.

ఈ మేర‌కు నేడు ఆమె త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. కేవలం జగిత్యాల జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఆడబిడ్డలు చదువుతున్న పాఠశాల్లో అన్ని వసతులు కల్పించాలని, తగిన విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

చిత్త‌శుద్ది ఉంటే బ‌య్యారం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయండి…

బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్య‌ కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోఛనీయమని విమర్శించారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement