Saturday, July 6, 2024

TG – మళ్ళీ గాలికి కూలిన మానేరు వాగు ఐదు పిల్లర్లు

టేకుమట్ల, జులై 2 (ప్రభ న్యూస్) జయశంకర్ భూపాలపల్లిజిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెన గ్యాడర్లు (బెడ్లు) మంగళవారం సాయంత్రం వీచిన గాలికి (ఓడేడు-గరిమెళ్ళపల్లి పరిధిలో) కూలిపోయాయి. తాత్కాలిక రోడ్డుపై పడ్డగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రమాద సమయంలో తాత్కాలిక రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత జూలై నెలలో వరదలకు టేకుమట్ల రాఘవ రెడ్డి పేట గ్రామాల మధ్యలోని చలివాగు పై నిర్మించిన వంతెన వరదకు కొట్టుకుపోవడం. ఇప్పుడు గాలికి వంతెన కూలడం మళ్లీ 5 పిల్లర్లు కూలడంతో మండలంలో చర్చనీయాంశం అవుతుంది.

2016లోప్రారంభం

ఓడుడు నుంచి భూపాలపల్లి జిల్లా గుర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమితో వంతెన నిర్మాణం ఆగిపోయింది. మంగళవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో బ్రిడ్జి గడ్డర్లు కూలిపోయాయి. దీంతో కాంట్రాక్టర్, అధికారుల పని తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement