Friday, November 22, 2024

TG – మూడు విడ‌త‌ల‌లో రైతుల రుణ మాఫీ…. రేవంత్ రెడ్డి

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఎన్నిక‌ల‌లో ఇచ్చిన వాగ్ధానం మేరకు రైతుల రుణ మాఫీ ప్రక్రియ‌ను ప్రారంభించామ‌ని, రేపు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ల‌క్ష రూపాయిల లోపు అర్హ‌త క‌లిగిన రైతులంద‌రికీ రుణ‌మాఫీ చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.. నేడు ప్రజాభవన్‌లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలలోగా రూ.1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. రేపు సాయంత్రం లోగా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.


నెలాఖరులోగా రెండో దఫాలో లక్షన్నర రూపాయల వరకు ఉన్న రైతులకు, . ఆగస్ట్ నెలలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. 7 నెలల్లోనే సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఏకమొత్తంలో వీటిని మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement