Sunday, January 19, 2025

TG l ఇందిర‌మ్మ రాజ్యంలో పేద‌ల జీవితాల్లో వెలుగులు – మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇందిరమ్మ రాజ్యంలో పేద‌వారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలండర్‌ను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. ఆ సంస్థ ఉద్యోగుల అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆరు గ్యారెంటీలు పథకాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు ఐదు లక్షల రూపాయల స్కీమ్ తో పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మానికి గృహనిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకట రామిరెడ్డి, సీనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, వైస్ ప్రసిడెంట్ భాస్కర్ రెడ్డి, కుమార్, రమేష్, రఘు, లింగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement