Sunday, January 12, 2025

TG l స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి

నిజామాబాద్ ప్రతినిధి జనవరి12: (ఆంధ్రప్రభ)స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆ యు వకులు ఆదర్శంగా నిలిచా రు. స్వామి వివేకానంద.. వేదాంత, ఆధ్యాత్మిక వేత్త. అతి పిన్న వయస్సు లోనే భారతీయ సంస్కృతీ సంప్ర దాయాల గొప్పదనాన్ని ప్రపం చానికి చాటిన మహనీ యుడు. అతని బోధనలు యువతకు ఆదర్శం..

స్వామి వివేకానంద జయంతి సంద ర్భంగా ప్రతి సంవత్సరం రావూజి ఉన్నత పాఠశాల 1996-1997 బ్యాచ్ విద్యా ర్థులు ఎన్ని పనులు ఉన్నా… పక్కన పెట్టి వివేకానంద జయంతి రోజునే ప్రతి సంవ త్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్య క్రమాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -

అందరూ ఒకరినొకరు కలు సుకొని తీపి గుర్తులను నెమరేసుకు న్నారు.

*2019లో స్వామి వివేకానంద విగ్రహన్ని ఆవిష్కరించిన యువత*

తాము చదువుకున్న పాఠశాలలో స్వామి వివే కానంద విగ్రహాన్ని ఆవిష్క రించాలనే దృఢ సంకల్పంతో పూర్వ విద్యార్థులు అందరూ డబ్బులు పోగు చేసి 2019 లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించి యువకులు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి రోజునే అందరము కలుసుకొని జయంతి కార్య క్రమాన్ని ఘనంగా నిర్వ హిస్తాం. సంవత్సరం తర్వాత ఒకరినొకరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుందన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధ నకు అందరు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలోనవతే శేఖర్,సిద్ధిరములు, సీతారి కృష్ణ, ఘన్ రాజు, బాలకుమార్, ప్రవీణ్, సంజు, సత్యనారాయణ, బాబు రావు, సంతోష్, లష్మినా రాయణ, శ్రీను,సురేష్,రాజు ఉపాధ్యాయులూ రవికు మార్, చంద్రశేఖర్, లడ్డు నరసయ్య లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement