హైదరాబాద్ – మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఆయనకు గుండెపోటు వచ్చింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
- Advertisement -