హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీమీద ప్రేమ ఒలకబోసేది అంటూ రేవంత్ పై మండిపడ్డారు బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. దొడ్డి దారిన పిసిసి ప్రసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసంటూ విమర్శలు కురిపించారు… ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.. నీఆలోచనల్లో కుసంస్కారం … నీ మాటలు అష్ట వికారం అంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు..
తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే నని అన్నారు.
గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అంటూ చెప్పారు.. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో . తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం అని కెటిఆర్ పేర్కొన్నారు..