మరి సిఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తావ్…
ట్విట్టర్ వేదికగా రేవంత్ ను నిలదీసిన కెటిఆర్
హైదరాబాద్ -రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వంద శాతం చేసినట్లు చెప్పుకుంటుండగా.. తాజాగా మంత్రి దామోదర రాజనరసింహ చేసిన వ్యాఖ్యలతో రుణమాఫీ అసంపూర్ణమని తేలిపోయిందని..ఇప్పుడు ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో..పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.
‘సన్నాసులు ఎవరో..సమర్థులు ఎవరో..అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో..మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడని కేటీఆర్ చురకలేశారు. రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని స్పష్టమైందని..మరి సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్‌లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? అని కేటీఆర్ ప్రశ్నించారు.రైతు డిక్లరేషన్ ఓ బూటకం..సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం..కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపమని’ కేటీఆర్ విమర్శించారు.
ఒక అమ్మాయికి అధికారం ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి!
ఒక అమ్మాయికి అధికారం ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారాక రామారావు (కేటీఆర్) అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలకు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. ధైర్యవంతులైన, తెలివైన అమ్మాయిలు.. మీరే భవిష్యత్.. ప్రకాశిస్తూ, కష్టపడుతూ, ప్రపంచాన్ని మారుస్తూ ఉండండి అని కేటీఆర్ సూచించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా, మీ అందరితో ఒక రహస్యాన్ని పంచుకుంటాను అని పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో అత్యుత్తమ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే.. పెద్ద కలలు కలిగిన చిన్నారులు మీరే అని అన్నారు. ప్రపంచాన్ని పాలించండి.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించినా విశ్రమించకండి.. మీరు కచ్చితంగా ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా, అద్భుతమైన ప్రదేశంగా మార్చుతారు అని కేటీఆర్ కొనియాడారు.