నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం
ట్విట్టర్లో కేటీఆర్ విమర్శలు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: సన్నాలకు బోనస్‌పై కాంగ్రెస్ సర్కార్ సవాలక్ష కొర్రీలు పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. 420 హామీల కాంగ్రెస్ పాలనో రైతుభరోసా ₹15 వేలు రాలేదని, ₹2 లక్షల రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని విమర్శించారు. పంటల కొనుగోళ్లు చెయ్యలేదని, వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ ₹500 ఇయ్యలేదన్నారు. జాగో తెలంగాణ అంటూ శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.